ఆశ్రమ పిల్లలకు పటాకులు, స్వీట్స్ అందించిన నాయకులు.
• ఆశ్రమ పిల్లలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న డ్యాన్సర్ వర్షిణి వరుమణి.
• ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్.
జనం వాయిస్, గోదావరిఖని:
దీపావళి పండుగ సందర్భంగా రామగుండం తబితా ఆశ్రమం లో ఉన్న నిస్సహాయ పిల్లలకు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో పటాకులు, స్వీట్స్ పంపిణీ చేయడం జరిగిందని ఆ సంస్థ అధ్యక్షులు మద్దెల దినేష్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఆశ్రమం లోని పిల్లలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ వారితో కలిసి దీపావళి పటాకులు కాలుస్తూ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆశ్రమం లో ఉన్న పిల్లలకు వివిధ పండుగల పర్వదినాల్లో వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి వారికి తల్లితండ్రుల లేని లోటును భర్తీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. అదేవిధంగా ఆశ్రమం లో ఉన్న పిల్లలు బాగా చదువుకుని మంచి ఉన్నత స్థాయికి ఎదిగి దేశానికి సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా గోదావరిఖని కి చెందిన డ్యాన్స్ మాస్టర్ సర్వేష్ తో పాటు డ్యాన్సర్ వర్షిణి కూడా పాల్గొని పిల్లల మధ్య దీపావళి వేడుకలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తొడుపునూరి రమేశ్ కుమార్, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై.లెనిన్, ఆశ్రమం నిర్వాహకులు వీరేంద్ర నాయక్ లు పాల్గొన్నారు.

Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments