EPAPER
Thursday, April 2, 2026
Google search engine

అంగన్వాడిలో 14 వేల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్..!

📰 Generate e-Paper Clip

అంగన్వాడిలో 14 వేల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్..!

జనం వాయిస్ దినపత్రిక,అక్టోబర్ 29:


తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తికి ప్రాధాన్య తనిస్తూ అంగన్‌వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే అంగన్‌వాడీ హెల్పర్లు, టీచర్ల నియా మకానికి సంబంధించి మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 14వేల అంగన్వాడీ పోస్టుల నియామకానికి ప్రభుత్వం వేగం పెంచింది మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ నియామక ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.బాలల సంరక్షణ గర్భిణీ స్త్రీల ఆరోగ్య పథకాలు సమర్ధవంతంగా అమలు కావాలంటే అంగన్వాడి సిబ్బంది నియామకం అత్యవసరమని,ఆమె అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ మరింత మెరుగుపడి, చిన్నారులకు, గర్భిణులకు అందాల్సిన సేవల్లో నాణ్యత పెరుగుతుందన్నారు.ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీలకు 100% కోట కొనసాగింపు పై సుప్రీంకోర్టు స్టే ఎత్తివేయడా నికి వెకేట్ పిటిషన్ వేయాలని ఆదేశించారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా నియా మక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సూచించారు.ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్లు, హెల్పర్లుతోపాటు.. మినీ అంగన్వాడి టీచర్ల పోస్టుల భర్తీపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!