EPAPER
Thursday, April 2, 2026
Google search engine

iBomma ఇక ఆగిపోయినట్టే.-ఐ-బొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్.

📰 Generate e-Paper Clip

iBomma ఇక ఆగిపోయినట్టే.

– ఐ-బొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్.

జనంవాయిస్, డెస్క్:

పైరసీ సైట్ వెనుకున్న అసలు మాస్టర్ మైండ్ ఐబొమ్మ గాళ్లకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు పోలీసులు.గతంలో ఐబొమ్మకు సంబంధించిన ఓ నిందితుడిని పట్టుకున్న పోలీసులు ఇప్పుడు ఏకంగా సూత్రధారినే వలేసి పట్టుకున్నారు.రెండేళ్ల క్రితం దమ్ముంటే పట్టుకోవాలంటూ పోలీసులకు వెబ్‌సైట్‌ ద్వారానే సవాల్‌ విసిరాడు ఇమ్మడి రవి.అప్పటి నుంచి అతడి కోసం గాలిస్తున్నారు.ఐ-బొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు.శనివారం ఉదయం కూకట్‌పల్లిలో సీసీఎస్‌ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవిని..పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇన్నేళ్లుగా కరేబియన్ దీవుల్లో ఉంటూ ఇమ్మడి రవి..ఐ-బొమ్మ సైట్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా,సినిమా పైరసీ అంశంలో ఐబొమ్మ,మూవీరుల్జ్ సైటులు గత కొంతకాలంగా నెట్‌ఫ్లిక్స్,అమెజాన్ ప్రైమ్,జియో హాట్‌స్టార్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీల్లోని కంటెంట్‌ను, అలాగే థియేటర్లలో విడుదలైన సినిమాలను పైరసీ చేస్తూ తమ సైట్లలో అప్‌లోడ్ చేస్తు న్నాయి.తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు..సైట్ మాస్టర్ మైండ్‌ను వెతికే పనిలో పడ్డారు.అలాగే గతంలో దమ్ముంటే పట్టు కోవాలంటూ ఇమ్మడి రవి పోలీసులకు సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఎట్ట కేలకు ఊసలు లెక్క పెడుతున్నాడు.భార్యతో విడిపోయి ఇమ్మడి రవి ఒంటరిగా ఉంటున్నట్టు తెలుస్తోంది.రవి అకౌంట్‌లో ఉన్న రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. అలాగే సర్వర్లలోని పైరసీ కంటెంట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!