బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి.
-పెద్దపల్లి జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి.
జనం వాయిస్, మంథని:
బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పెద్దపెల్లి జిల్లా బిజెపి మాజీ అధ్యక్షుడు చందుపట్ల సునీల్ రెడ్డి అన్నారు.పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ కేంద్రంలోని బీజేపీ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని సర్పంచ్, వార్డ్ అభ్యర్థులుకు దిశ నిర్దేశం చేశారు.ప్రతి కార్యకర్త సమిష్టి గా కృషి చేసి కేంద్రం ప్రభుత్వ పథకాలు,అభివృద్ధి కార్యక్రమలు ప్రజలకు వివరిస్తూ,బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధిక మెజారిటీ తో గెలిపించి బీజేపీ పార్టీ సత్తా చాటలని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ రాష్ట్ర నాయకులు కొండా పాక సత్య ప్రకాష్,చల్లా నారాయణ రెడ్డి,మండల అధ్యక్షులు,యువ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments