ధర్మారం మోడల్ స్కూల్‌లో అసిస్టెంట్ కుక్/హెల్పర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.
జనం వాయిస్, ధర్మారం, జూలై 17:
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో అసిస్టెంట్ కుక్/హెల్పర్ పోస్టును పూర్తిస్థాయిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు మండల విద్యాధికారి పి. ప్రభాకర్ తెలిపారు. ఈ పోస్టుకు ధర్మారం మండలానికి చెందిన బీసీ-ఏ మహిళా అభ్యర్థుల నుంచి జూలై 18 నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై, 25 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, 7వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్‌లను జతచేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోపు తెలంగాణ మోడల్ స్కూల్ బాలికల వసతి గృహం కేర్ టేకర్/వార్డెన్‌కు దరఖాస్తులు సమర్పించాలని మండల విద్యాధికారి సూచించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments