మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలి.
జనం వాయిస్, మంథని:
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థిక స్వాలంభన సాధించాలని సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ రూరల్ మేనేజర్ సాదినేని కవిరాజు అన్నారు. గురువారం మంథని పట్టణంలోని శ్రీపాద కాలనీలో అమ్మ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉష శిలాయి స్కూల్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని, మహిళలు మరొకరిపై ఆధారపడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. శిక్షణ పొందిన ప్రతి ఒక్క మహిళా పారిశ్రామికవేత్తలుగా ఉద్యమ్ (ఎం ఎస్ ఎం ఈ) రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా 30 మంది మహిళలకు కుట్టు శిక్షణ ధ్రువీకరణ పత్రాలు ట్రైనింగ్ మెటీరియల్, బోర్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి అమ్మ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అంకరి కుమార్ అధ్యక్షత వహించగా కుట్టు శిక్షకురాలు అజ్మీరా షారోన్, అంకరి పద్మజా తో పాటు పలువురు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments