ప్రజా ప్రభుత్వంలో ప్రజల విజయం.
– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్.
జనం వాయిస్,మంథని, డిసెంబర్ 12:
మంథని మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్ గా గెలవడం పట్ల మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ప్రజల విజయమని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వమని, ప్రజా ప్రభుత్వంలో ప్రజల విజయమని ఆయన తెలిపారు. తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంచి గెలిపించినందుకు ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments