EPAPER
Monday, February 16, 2026
Google search engine

29-12-2025 సోమవారం..రాశి ఫలితాలు.

📰 Generate e-Paper Clip

29-12-2025 సోమవారం..రాశి ఫలితాలు.
—————————————
మేషం

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కీలక సమయంలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి.
—————————————
వృషభం

ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణయత్నాలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి.
—————————————
మిధునం

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు పరిష్కారమౌతాయి. చేపట్టిన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు.
—————————————
కర్కాటకం

ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. బంధువులతో వివాదాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
—————————————
సింహం

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయ సభ, సమావేశాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది.
—————————————
కన్య

సన్నిహితులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
—————————————
తుల

దైవ దర్శనాలు చేసుకుంటారు.  సోదరులతో వివాదాలు చికాకు పరుస్తాయి. దీర్ఘకాలిక  రుణాల ఒత్తిడి పెరుగుతుంది. నూతన రుణయత్నాలు చేస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి.
—————————————
వృశ్చికం

వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దైవ సేవా సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు  మందకోడిగా సాగుతాయి.
—————————————
ధనస్సు

పాత సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో ఊహించని మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.
—————————————
మకరం

ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి.
—————————————
కుంభం

ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాలు ఒత్తిడితో కానీ పూర్తి కావు. సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. మొండి బాకీలు కొన్ని వసూలవుతాయి.
—————————————
మీనం

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చిన్న పాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున నత్తనడకన సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
—————————————


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!