రూ.15 లక్షల లంచంతో ఏసీబీకి చిక్కిన ఇంజనీర్.
– బిల్లుల పాస్ కోసం రూ.30 లక్షల డిమాండ్.
– కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా లంచం తీసుకుంటూ ఏసీబి చిక్కిన చిన్నారెడ్డి.
జనం వాయిస్, హైదరాబాద్:
కూకట్పల్లి జోన్కు చెందిన సూపరిండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి లంచం తీసుకుంటూ తెలంగాణ ఏసీబీ అధికారులకు చిక్కారు. చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్కు సంబంధించిన బిల్లులు పాస్ చేయడానికి రూ.30 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంబంధిత కాంట్రాక్టర్ సుమారు రూ.1.4 కోట్ల విలువైన పనులు పూర్తి చేశాడు. ఈ పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలంటే రూ.30 లక్షలు ఇవ్వాలని ఇంజనీర్ చిన్నారెడ్డి డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లంచాన్ని రెండు విడతల్లో తీసుకునేందుకు అంగీకారం కుదిరినట్లు ఏసీబీ పేర్కొంది. ఈ క్రమంలో మొదటి విడతగా రూ.15 లక్షలు తీసుకునే సమయంలో ఏసీబీ అధికారులు వలపట్టి పట్టుకున్నారు. ఇంజనీర్ నేరుగా డబ్బులు తీసుకోకుండా, కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా లంచం స్వీకరిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, ఇంజనీర్ చిన్నారెడ్డితో పాటు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments