EPAPER
Sunday, February 15, 2026
Google search engine

సింగరేణి చైర్మన్‌గా డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ బాధ్యతల స్వీకారం.

📰 Generate e-Paper Clip

సింగరేణి చైర్మన్‌గా డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ బాధ్యతల స్వీకారం.

హైదరాబాద్ సింగరేణి భవన్‌లో అధికారిక బాధ్యతలు.
2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
పలు కీలక శాఖల్లో విస్తృత అనుభవం.

జనం వాయిస్, హైదరాబాద్, ఫిబ్రవరి 12:

సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ గురువారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో అధికారిక బాధ్యతలు స్వీకరించారు. 2002 బ్యాచ్ తెలంగాణ కేడర్‌కు చెందిన డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ గతంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖకు ప్రభుత్వ కార్యదర్శిగా సేవలందించారు. రవాణా, భూమి రికార్డులు, సామాజిక సంక్షేమ రంగాల్లో విస్తృత అనుభవం కలిగి ఉన్నారు. రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల కమిషనర్, ఇన్‌స్పెక్టర్ జనరల్, సర్వే సెటిల్మెంట్లు మరియు ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్, భూభారతి ప్రాజెక్ట్ డైరెక్టర్ వంటి కీలక బాధ్యతలు నిర్వహించారు. సింగరేణి సంస్థను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని ఆయన బాధ్యతల స్వీకారం సందర్భంగా తెలిపారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!