- మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం.
- ఇద్దరు యువకులకు గాయాలు.
- ఇసుక లారీ అతివేగమే కారణమంటున్న స్థానికులు.
- జనం వాయిస్,భూపాలపల్లి, ఫిబ్రవరి21:
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ – కాలేశ్వరం మధ్య జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.ఇసుక లారీ అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ద్విచక్ర వాహనం తో పాటు ఇద్దరు యువకులు రోడ్డుపై పడిపోయారు. వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు మహారాష్ట్ర కు చెందిన ఆడే ఉజ్వల్(22), ఆడే ప్రజ్వల్(18) కొప్పరెల్లి గ్రామం, ముచ్చర తాలూకా, గడిచి రెల్లి జిల్లా వాసులుగా గుర్తించారు. పోలీసులు లారీని స్వాధీన పరుచుకొని, డ్రైవర్ ను అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments