ఆ ఊర్లో కట్నం తీసుకోరు.. మద్యం తాగొద్దు..!
జనం వాయిస్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ (D) ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ పటేల్ మేస్రం వేంకట్ అధ్యక్షతన గ్రామస్థులు ఏర్పాటు చేసిన సమావేశంలో సంచలన తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పూర్తిగా వరకట్నాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఊర్లో జరిగే వివాహానికి ప్రతి ఇంటి నుంచి రూ.200 ఇవ్వాలన్నారు. అలాగే పెళ్లికి వచ్చేటప్పుడు మద్యం తాగవద్దని, ఇతర గ్రామాలకు వెళ్లేటప్పుడు చెప్పులు వేసుకోవద్దన్నారు. కట్నంగా బైకులనూ నిషేధించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments