దారుణం తాగుడుకు బానిసై..పసిబిడ్డను అమ్మిన కన్నతల్లి.
జనం వాయిస్, మెదక్:
మెదక్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హవేలీ ఘనపూర్ మండలం లింగసానిపల్లి తాండాకు చెందిన మంజూల అనే మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే మద్యానికి బానిసైన మంజూల దగ్గర తాగడానికి డబ్బులు లేకపోవడంతో ఆమె ప్రియుడు మహిపాల్‌తో కలిసి కన్నబిడ్డను కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ దంపతులకు రూ.1.70 లక్షలకు అమ్మింది. మగశిశువు పుట్టిన వారం రోజులకే ఈ దారుణం జరిగింది. బాలింతకు ఇవ్వాల్సిన ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో అంగన్‌వాడీ టీచర్ అనుమానంతో అధికారులకు సమాచారం ఇవ్వగా విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు శిశువును స్వాధీనం చేసుకొని సఖి కేంద్రానికి తరలించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments