EPAPER
Tuesday, March 17, 2026
Google search engine

ఉగాది కానుకగా రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. యూఎస్‌లో జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్.

📰 Generate e-Paper Clip

ఉగాది కానుకగా రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. యూఎస్‌లో జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్.

జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 16:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉగాది కానుకగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
విదేశీ మార్కెట్‌లో ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం రెండు లక్షల డాలర్లకు పైగా కలెక్షన్లు నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే పదివేలకుపైగా టికెట్లు ఇప్పటికే అమ్ముడైనట్లు సమాచారం. విడుదలకు ఇంకా కొన్ని రోజులు ఉండటంతో రాబోయే రోజుల్లో బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్టైల్ యాక్షన్, దర్శకుడు హరీష్ శంకర్ కమర్షియల్ టచ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ నిర్మాణ విలువలతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఉగాది సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!