తండ్రి మరో మహిళతో వివాహేతర సంబంధం.
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోని తండ్రిని చంపిన కొడుకులు.!
జనం వాయిస్, భూపాలపల్లి జిల్లా,ఏప్రిల్ 05:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కన్న కొడుకులు తండ్రిని చంపిన ఘటన కలకలం రేపింది. రేగొండ మండలం రేపాక గ్రామంలో తండ్రి మరో మహిళతో వివేహేతర సంబంధం కొనసాగిస్తుండగా కన్న కొడుకులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కోపంతో రగిలిపోయిన కొడుకులు కన్న తండ్రి పై విచక్షణ రహితంగా ఇద్దరు కొడుకులు దాడి చేశారు. అంతేకాకుండా గొడ్డలితో దాడి చేయడంతో కుర్రే చేరాలు అనే 45 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతనితోపాటు.. సంబంధం పెట్టుకున్న మహిళ పై కూడా దాడి చేయడంతో తీవ్ర గాయాలు కావడంతో వారిని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. చేరాలు శనివారం రాత్రి మృతి చెందగా మహిళా చికిత్స పొందుతుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments