EPAPER
Monday, April 6, 2026
Google search engine

రాశి ఫలితాలు (06-04-2026)

📰 Generate e-Paper Clip

రాశి ఫలితాలు (06-04-2026)

మేషం


ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.


———————————-

వృషభం


ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. కీలక విషయాలలో ఆలోచించి ముందుకు సాగాలి. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి.
—————————————

మిధునం


చేపట్టిన పనులలో మార్గ అవరోధాలు కలుగుతాయి. అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి. మాతృ వర్గ బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారములలో నష్ట సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.
—————————————

కర్కాటకం


చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.
—————————————

సింహం


నేత్ర సంభందిత సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వృత్తి ఉద్యోగములలో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి.
—————————————

కన్య


ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు ఋణాలు తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి.
—————————————

తుల


గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.
—————————————

వృశ్చికం


చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని పనులు అనుకూలంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. వృత్తి,ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.
—————————————

ధనస్సు


దైవ సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. మొండి బాకీలు సకాలంలో వసూలు అవుతాయి. బంధు మిత్రులతో సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
—————————————

మకరం


ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.
—————————————

కుంభం


బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.
—————————————

మీనం



వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. ఆర్ధిక విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!