EPAPER
Saturday, April 11, 2026
Google search engine

అవినీతి ఆరోపణలు..కేసుల్లో అలసత్వం

📰 Generate e-Paper Clip

అవినీతి ఆరోపణలు..కేసుల్లో అలసత్వం

– ఆత్మకూరు ఎస్సై సస్పెన్షన్

జనం వాయిస్, వరంగల్:

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సతీష్ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సైపై వచ్చిన అవినీతి ఆరోపణలతో పాటు పలు కేసుల విచారణలో అలసత్వం వహించినట్లు ఉన్న ఫిర్యాదులపై ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఎస్సై సతీష్ విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు, బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని నిర్ధారణ కావడంతో తక్షణమే సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పోలీస్ శాఖలో క్రమశిక్షణను కాపాడే దిశగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం పోలీస్ శాఖకు అత్యంత ముఖ్యమని అధికారులు స్పష్టం చేశారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!