సమాజ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రమజీవులకు మేడే శుభాకాంక్షలు.
మంత్రి కందుల దుర్గేష్.
విజ్జేశ్వరంలో మే డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి.
జనం వాయిస్, నిడదవోలు, మే 01:
లోకాన్ని నడిపించే చక్రం శ్రామికుడి చెమట చుక్కేనని, సమాజ ప్రగతికి పునాది వేస్తున్న ప్రతి కార్మిక సోదరుడికి మంత్రి కందుల దుర్గేష్ మే డే శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా విజ్ఞేశ్వరం గ్రామంలో నిర్వహించిన మే డే వేడుకల్లో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికుల జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశ అభివృద్ధిలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. “వృత్తి ఏదైనా శ్రమ ఒక్కటే, శ్రమను గౌరవించడం, శ్రామికుడికి బాసటగా నిలవడం మనందరి బాధ్యత” అని పేర్కొన్నారు. కార్మికులు గౌరవంగా జీవించడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని, వారి హక్కుల పరిరక్షణకు మరియు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని భరోసా ఇచ్చారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments