నా కోసం పుట్టావు.. కోట్లాది మంది కోసం జీవించావు.
– చంద్రబాబు పుట్టినరోజు.. భువనేశ్వరి భావోద్వేగ శుభాకాంక్షలు.
– ఎక్స్ వేదికగా ప్రేమపూర్వక సందేశం.
జనం వాయిస్, అమరావతి, ఏప్రిల్ 20:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు 76వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య నారా భువనేశ్వరి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా భావోద్వేగపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భర్తపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. నా కోసం ఈ రోజు పుట్టావు.. కోట్లాది మంది కోసం జీవించావు. మీలో సగమై.. మీ కృషిలో భాగమై.. నా స్వేచ్ఛా స్వతంత్ర సేవా సాధికార మార్గదర్శి.. పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీ భూ” అంటూ ఆమె రాసిన సందేశం అందరినీ ఆకట్టుకుంది. చంద్రబాబు జీవితాన్ని ప్రజాసేవకు అంకితమైనదిగా కొనియాడుతూ, ఆయన తనకు మార్గదర్శి అని పేర్కొన్నారు. ఈ సందేశంతో పాటు కేక్ కట్ చేస్తున్న ఫొటోను కూడా భువనేశ్వరి షేర్ చేశారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్పందిస్తూ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వర్లో “మీ భూ” అని క్లుప్తంగా రాయడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ చిన్న పదంలోనే ఆమె ప్రేమ, అనుబంధం ప్రతిబింబించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సందేశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments