తమిళనాట దళపతి విజయ్ సర్కార్!
జనం వాయిస్, వెబ్ డెస్క్:
తిరిగి వెళ్లే ఐడియానే లేదు, ఐ యాం కమింగ్ తన పొలిటికల్ కెరీర్ పై ఇంటు ఇస్తూ… జననాయగన్, మూవీలో హీరో విజయ్, చెప్పిన డైలాగ్ ఇది అన్నట్టు గానే తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అయన ఎంట్రీ లోనే ప్రజలతో విజిల్ వేయించారు. ఎగ్జిట్ ఫోల్ అంచ నాలను తలకిందులు చేస్తూ తన సర్కార్ ను స్థాపించుకున్నాడు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీవీకే పార్టీ స్పష్టమైన ఆధి క్యాన్ని కొనసాగిస్తోంది. దళపతి విజయ్ తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. తమిళనాడులో టీవీకే దూసుకెళుతుండటంతో పక్క రాష్ట్రాల రాజకీయ నాయకులు టీవీకే పార్టీ అధినేత విజయ్,కు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ రాజకీయా ల్లోకి చారిత్రాత్మకంగా ఎంట్రీ ఇచ్చింది. ఓ స్పష్టమైన ట్రెండ్ బలపడుతోంది, అంటు న్నారు ఆయన పార్టీ శ్రేణులు.రాష్ట్ర ప్రయో జనాలకు కట్టుబడి, నిష్పక్షపాతంగా, విశ్వసనీయంగా ఉండే ప్రాంతీయ పార్టీలకు దక్షిణ భారతదేశంలో చోటు ఖాయమనే భరోసాని కల్పిస్తోంద న్నారు.
ఈ ఎన్నికల్లో పాత పార్టీలు చాలా కష్టంగా బరిలోకి దిగుతుంటే.. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు నూతన ఉత్సాహం, శక్తి, ఏకాగ్ర తను, నూతన ఉత్సా హాన్ని తీసుకొస్తున్నా రని, వ్యాఖ్యానించా రు. తమిళనాడులో విజయ్, గెలుపు దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త పార్టీలకు అవకాశం ఉంటుందనే బలమైన సంకేతాలు పంపిందని పార్టీ వర్గా లు చెబుతున్నాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments