ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత..!
జనం వాయిస్, హైదరాబాద్, జులై 11:
భారత్ సినీ పరిశ్రమ లో విషాదం నెలకొంది. పాటల కోకిల జానక మ్మ గొంతు మూగ బోయింది. కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వేల పాటలతో అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించిన సింగర్ జానకి శనివారం సాయంత్రం మరణించారు.
జానకి ఏప్రిల్1938 గుంటూరు జిల్లాలోని రేపల్లెలో జన్మించారు తల్లిదండ్రులు శ్రీరామ మూర్తి, శకుంతలమ్మ, భర్త వి రాంప్రసాద్, 1992లో మరణించా రు. వీరికి మురళీకృష్ణ అనే ఒక కుమారుడు ఉన్నారు. 1957లో విడుదలైన విధియిన్ విలయాడల్, అనే తమిళ్ చిత్రం ద్వారా ఆమె గాయనిగా పరిచయం అయ్యారు. ఆమె తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ తో పాటు సుమారు 17 కు పైగా భారతీయ భాషల్లో పాటలు పాడారు. గత కొన్నాళ్లుగా పలు అనారోగ్య సమస్యలు, వయోభారంతో ఇబ్బంది పడుతున్న జానకి గుండెపోటుతో మైసూర్ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతూ.. ఈరోజు సాయంత్రం మరణించారు. ఎస్.జానకిగా అందరికి పరిచయ మైన ఈమె అసలు పేరు శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి. రేపల్లె దగ్గర ఓ గ్రామంలో పుట్టిన జానకమ్మ చిన్నప్పట్నుంచీ సంగీతం నేర్చుకొని స్టేజి పర్ఫార్మెన్స్లు ఇచ్చేది. తన మామయ్యతో మద్రాస్ వెళ్లి అక్కడ 1957 లో ఓ తమిళ సినిమాతో గాయనిగా మారింది. తన 60 సంవత్సరాల పైన సినీ జీవితంలో తెలుగు, తమిళం, మలయా ళం, కన్నడ, ఒడియా, హిందీ.. భాషలలో దాదాపు 48,000 పైగా పాటలు పాడారు.

Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments