రాజకీయాల్లోకి త్రిష రావాలని భారీ పోస్టర్స్!
జనం వాయిస్, చెన్నై, ఆగస్టు 05:
తమిళనాడులో రాజకీయాలు హీరోయిన్ త్రిష చుట్టూ తిరుగుతున్నాయి. కావేరి నదీ జలాల వివాదంపై సభ నిర్వహించిన ఉదయనిధి స్టాలిన్… అందులో త్రిషపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ కంటే ముందు డీఎంకే ఎమ్మెల్యేలు ఇద్దరు త్రిషపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు అరెస్ట్ అయ్యారు. రాజకీయ వర్గాల్లో ఈ అరెస్టులు సంచలనం సృష్టించాయి. ఇవి పక్కన పెడితే… మధురైలో వెలిసిన త్రిష పోస్టర్లు ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారాయి.సుమారు రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న కొద్ది మంది అందాల భామలలో త్రిష ఒకరు. కోట్లలో ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇటీవల మధురైలో కొంత మంది అభిమానులు ‘త్రిష ఛారిటీ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం చర్చకు దారి తీసింది. రాజకీయ వర్గాల్లో ఆ ఫౌండేషన్ చర్చకు దారి తీసింది.
ఇన్నాళ్ళూ లేనిది ఇప్పుడు మధురైలో త్రిష పేరుతో ఫౌండేషన్ స్టార్ట్ చేయడం వెనుక పొలిటికల్ స్కెచ్ ఏమైనా ఉందా? అని రాజకీయ వర్గాల్లో కాస్త వాడి వేడీ చర్చ జరుగుతోంది. ఫౌండేషన్ ప్రారంభించిన సందర్భంగా మధురై అంతటా పోస్టర్లు వేశారు. ఆ పోస్టర్ల మీద ‘రాకీయాల్లోకి త్రిష రావాలి’ అని ఉంది. అంతే కాదు… ‘తమిళనాడు వీరమంగై వేలు నాచియార్’ అని త్రిషను పేర్కొన్నారు. వీరమంగై అంటే వీరవనిత, ధైర్య సాహసాలు గల మహిళ అని అర్థం. వేలు నాచియర్ అంటే 18వ శతాబ్దంలో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తమిళ మహిళ. ఇప్పుడు అభినవ వేలు నాచియర్‌గా త్రిషను ప్రమోట్ చేస్తున్నారు. అదీ సంగతి.
త్రిష పేరుతో ఎవరు రాజకీయం చేసినా విజయ్ సహించడం లేదు. ఆ విధమైన సిగ్నల్స్ స్పష్టంగా ఉన్నాయి. డీఎంకే ఎమ్మెల్యేలను కాదు… ఏకంగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధిని సైతం అరెస్ట్ చేయించారు. రాజకీయాల్లోకి త్రిష అడుగు పెట్టే సమయానికి ఆమెకు ఎటువంటి టెన్షన్ లేకుండా చేస్తున్నారా? వంటి ప్రశ్నలు సైతం వస్తున్నాయి. త్రిష సినిమాలకు వస్తే… మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ చిత్రీకరణ పూర్తి చేశారు. మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించనున్న థ్రిల్లర్ ‘రామ్’ యాక్సెప్ట్ చేశారు. తమిళంలో మరో రెండు సినిమాలు ఉన్నాయట.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments