EPAPER
Saturday, September 12, 2026
Google search engine

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు..!

📰 Generate e-Paper Clip

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు..!

ఉత్తర, తూర్పు జిల్లాలపై అధిక ప్రభావం.

హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక.

జనం వాయిస్, హైదరాబాద్, సెప్టెంబర్ 12:

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శని, ఆదివారాల్లో (సెప్టెంబర్ 12, 13) రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దక్షిణ ఒడిశా తీరం, వాయవ్య-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడి, పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా విదర్భ వైపు వెళ్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావం రాష్ట్రంలో సెప్టెంబర్ 14 వరకు ఉంటుందని, ముఖ్యంగా 12, 13 తేదీల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 50 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ప్రభావం తక్కువగా ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఇక రాజధాని హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడొచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30-32 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23-24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షాలు ఊరటనిచ్చే అంశమైనప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత భవనాల కింద ఉండరాదని హెచ్చరించారు. రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. సెప్టెంబర్ 15 నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!