రైస్ మిల్లుల బకాయిలు చెల్లించకుంటే ఆస్తులు సీజ్! కలెక్టర్ కోయ శ్రీహర్ష.
- రెండు, మూడు రోజుల్లో బకాయిలు చెల్లించాల్సిందే.
- డిఫాల్టర్ మిల్లర్ల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను గుర్తించాలి.
- జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు ఆదేశాలు.
జనం వాయిస్, పెద్దపల్లి, అక్టోబర్ 22:
రైస్ మిల్లుల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బకాయిల చెల్లింపుల్లో నిర్లక్ష్యం వహించే రైస్ మిల్లర్లపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గురువారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బకాయిలు చెల్లించకుండా జాప్యం చేస్తున్న డిఫాల్టర్ రైస్ మిల్లర్ల ఆస్తులు, బ్యాంకు ఖాతాల వివరాలను వెంటనే సేకరించాలని ఆదేశించారు. రెండు, మూడు రోజుల్లోగా పెండింగ్ బకాయిలు చెల్లించని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం సంబంధిత రైస్ మిల్లుల ఆస్తులు, బ్యాంకు ఖాతాలను సీజ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే డిఫాల్టర్ రైస్ మిల్లర్లు, వారి కుటుంబ సభ్యుల ఆస్తుల లావాదేవీలపై నిబంధనలకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి రావాల్సిన బకాయిల వసూళ్లలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, జిల్లా మేనేజర్ శ్రీకాంత్, డీసీఓ శ్రీమాల, ఆర్డీఓ గంగయ్యతో పాటు సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments