రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు.!
జనం వాయిస్, వెబ్ డెస్క్:
బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పుర స్కరించుకొని రేపు 27వ తేదీన ప్రతి నియోజకవర్గా ల్లో, జిల్లా కేంద్రాల్లో,పార్టీ జెండాలను ఎగురవేయాల ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చా రు. ఇవ్వాలా పార్టీ శ్రేణులతో కేటీఆర్,టెలి కాన్ఫిరెన్స్ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. ఇక స్పీడ్ పెంచా ల్సిందే. ఇటు అధికార కాంగ్రెస్‌ను..ఇటు కవిత పార్టీని టార్గెట్ చేస్తూ… దూకుడు పెంచాల్సిందేనని డిసైడ్ అయిందట గులాబీ పార్టీ.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని గులాబీ బాస్ డిసైడ్ చేశారట. ఈనెల 27న పార్టీ ఆవిర్భావ వేడు కల ముగింపు సమావేశం లో కేసీఆర్ కీలక నిర్ణయా లు ప్రకటించబోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ పేరును టీఆర్ఎస్‌గా మార్చాలన్న డిమాండ్ నేపధ్యంలో ఊహించని మార్పులు ఉండొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక పోరుబాటే అంటోంది బీఆర్ఎస్. ఇప్పటికే కాంగ్రె స్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తుండ టంతో..ఇంక స్పీడును పెంచేందుకు సమూల మార్పులకు సిద్ధమవు తోంది. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్స వాల ముగింపు సందర్భం గా..తెలంగాణ భవన్‌లో కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ హాజరుకానున్న ఈ మీటిం గ్ చాలా కీలకమైందిగా చెబుతున్నారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు… 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని బిగ్ డెసిషన్స్ తీసుకోబోతున్నారన్న టాక్ నడుస్తోంది.
పూర్తిస్థాయిలో కమిటీల ఏర్పాటుపై ఫోకస్..
పార్టీ పేరు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంపై అధినేత కేసీఆర్ పూర్తిగా దృష్టి పెట్టలేదు. చాలా కాలంగా పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తిస్థాయిలో జరగలేదు. 2022లో ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మార్చిన కేసీఆర్ వెంటనే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంటు ఎలక్షన్స్ బిజీలో ఉండిపోయారు.
దీంతో కమిటీల నియా మకం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోం ది. ఇప్పుడు ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైమ్ మా త్రమే ఉండటంతో..పార్టీ బలోపేతంపై కేసీఆర్ సీరియస్ ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీకి జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర స్థాయిలో కొంత మంది ప్రధాన కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. దీంతో కొత్త కమిటీల నియామకం తప్పనిసరని భావిస్తు న్నారట,రెండు మూడు నెలల్లో కచ్చితంగా కమి టీలన్నీ నియమించాలన్న ప్లానింగ్‌లో ఉన్నారట. సభ్యత్వ నమోదు తర్వాత పూర్తిస్థాయిలో కమిటీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తుంది,
పార్టీ పేరు మార్పుపై కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం…
ఇక పార్టీ పేరును టీఆర్ ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత వరుసగా అసెంబ్లీ, లోక్ సభ ఎన్ని కల్లో ఘోర పరాజయం పాలవడం తో..నెగెటివ్ సెంటిమెంట్‌గా ఫీల్ అవుతున్నారట. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన తర్వాతే పార్టీ అధికారం కోల్పోయిందని, నేతల చుట్టూ కేసులు విచారణలు అంటూ కష్టాలు మొదలయ్యాయనే చర్చ పార్టీలో ఉంది. ఈ నేపధ్యంలో పార్టీ పేరును మళ్లీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్‌గా మార్చాలన్న డిమాండ్ పెరుగుతూ వస్తోంది.
దీంతో పార్టీ పేరు మార్పుపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఢిల్లీలో న్యాయ నిపుణుల తో చర్చించినట్లు తెలు స్తోంది. ఈ క్రమంలోనే ఈనెల 27న జరగబోయే పార్టీ కీలక సమావేశంలో పార్టీ పేరు మార్పుపై కేసీఆర్, కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నా రు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments