గోదావరిఖని హెచ్.డి.ఎఫ్.సీ బ్యాంకులో అగ్నిప్రమాదం.
జనం వాయిస్, గోదావరిఖని, సెప్టెంబర్ 06:
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏసీలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగి బ్యాంకు అంతా పొగతో నిండిపోయింది. విలువైన ఫర్నిచర్ కాలి బూడిద అయింది. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్‌తో నీటిని చల్లి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టంపై బ్యాంకు మేనేజర్ వివరాలు సేకరిస్తున్నారు. ఈ సంఘటనలో సమీపంలో ఉన్న ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments