EPAPER
Tuesday, October 27, 2026
Google search engine
- Advertisment -spot_img

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

📰 Generate e-Paper Clip

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

  • 2028 మహిళల టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న పాకిస్థాన్.
  • ‘హైబ్రిడ్ మోడల్‌’లో టోర్నమెంట్ నిర్వహణకు ఐసీసీ నిర్ణయం.
  • భారత జట్టు ఆడే మ్యాచ్‌లన్నీ యూఏఈలో నిర్వహించే అవకాశం.
  • 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తరహాలోనే ఏర్పాట్లు చేస్తున్న పీసీబీ.
  • భారత్ ఫైనల్‌కు రాకపోతే లాహోర్‌లో ఫైన‌ల్‌ నిర్వహణ.

జనం వాయిస్, స్పోర్ట్స్, అక్టోబర్ 25:

2028లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత జట్టు ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదిక అయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్‌ను ‘హైబ్రిడ్ మోడల్’ పద్ధతిలో నిర్వహించాలని ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. ఇటీవల 2025లో జరిగిన పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ఇదే హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వగా.. భారత జట్టు తన మ్యాచ్‌లన్నీ యూఏఈలోనే ఆడింది. దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో విజేతగా నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీలోని 15 మ్యాచ్‌లలో 10 మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు మహిళల టీ20 ప్రపంచకప్‌కు కూడా అదే ఫార్ములాను అనుసరించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భావిస్తోంది. ఈ విషయంపై పీసీబీ వర్గాలు మాట్లాడుతూ.. మహిళల టీ20 ప్రపంచకప్‌ నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని, ఛాంపియన్స్ ట్రోఫీ తరహాలోనే ఈ టోర్నీని కూడా విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశాయి. “భారత జట్టు ప్రమేయం లేని గ్రూప్ మ్యాచ్‌లు, నాకౌట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం” అని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. పాకిస్థాన్, దుబాయ్ మధ్య ప్రయాణ దూరం తక్కువగా ఉండటం, లాజిస్టిక్స్ ఖర్చులు కూడా తగ్గడం వల్ల యూఏఈనే తటస్థ వేదికగా ఎంచుకోవడం ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లలో ఒకటైన భారత్, ఈ టోర్నీలో నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ భారత జట్టు ఫైనల్‌కు చేరితే, ఆ మ్యాచ్ యూఏఈలోనే జరుగుతుంది. ఒకవేళ భారత్ ఫైనల్‌కు అర్హత సాధించకపోతే, తుదిపోరుకు లాహోర్ నగరం ఆతిథ్యం ఇస్తుందని పీసీబీ వర్గాలు స్పష్టం చేశాయి. ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా పాకిస్థాన్‌కు హోస్టింగ్ ఫీజుతో పాటు టోర్నీ నిర్వహణ ఖర్చులకు నిధులు లభిస్తాయి. ఈ మెగా టోర్నీ నిర్వహణతో దేశంలో మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ లభిస్తుందని పీసీబీ ఆశిస్తోంది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!