EPAPER
Thursday, June 4, 2026
Google search engine

సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం.

📰 Generate e-Paper Clip

సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం.

– భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు.
– రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.

జనం వాయిస్, కాళేశ్వరం, మే 21:

పుష్కరాల తొలి రోజు ఉదయం 5.43 గంటలకు పవిత్ర సంగంలో తొలి పుష్కర స్నానం నిర్వహించబడింది. ఈ పుణ్యస్నానాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు, ఐటి పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్  హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు శ్రీ గోవింద హరి తదితరులు ఆచరించారు. అలాగే భూపాలపల్లి, రంగారెడ్డి నియోజకవర్గాల  శాసనసభ్యులు  గండ్ర సత్యనారాయణ రావు,  మల్ రెడ్డి రంగారెడ్డి  పుష్కర స్నానంలో పాల్గొన్నారు. పుష్కరాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. భద్రత, పారిశుధ్యం, తాగునీరు, వైద్య సేవలు, రవాణా వంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు.
ఈ పుణ్యకాలంలో భక్తులు సౌకర్యవంతంగా, సురక్షితంగా పుష్కర స్నానాలు నిర్వహించుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!