బీఆర్ఎస్ సభ్యత్వ ఇన్చార్జిల నియామకం.
– మంచిర్యాలకు కౌశిక్ హరి.
– చెన్నూర్‌కు తిప్పని లింగన్న.
– బెల్లంపల్లికి మిరియాల రాజిరెడ్డి.
– నియామకాల జాబితా విడుదల చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
జనం వాయిస్, మంచిర్యాల ప్రతినిధి, మే 21:
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అధిష్టానం ఇన్చార్జిలను నియమించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేసిన ఈ నియామకాల జాబితా ప్రకారం.. మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జిగా కౌశిక్ హరి, చెన్నూర్ నియోజకవర్గానికి తిప్పని లింగన్న, బెల్లంపల్లి నియోజకవర్గానికి మిరియాల రాజిరెడ్డిలను నియమించారు.

పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఈ చర్యల ద్వారా ఆయా నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తూ, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి ఈ ఇన్చార్జిలు పర్యవేక్షించనున్నారు. ఈ నూతన నియామకాలు బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని, రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు మరింత చురుగ్గా సాగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments