క్రీస్తు బోధనలు అందరూ అనుసరించదగినవి.
-అరెంద సర్పంచ్ జాడి రామస్వామి.
జనం వాయిస్,మంథని,డిసెంబర్ 14 :
యేసుక్రీస్తు బోధనలు అందరూ అనుసరించదగినవని మంథని మండలం అరెంద సర్పంచ్ జాడి రామస్వామి అన్నారు. ఆదివారం సీయోను ప్రార్ధన మందిరం ఆధ్వర్యంలో మంథని మండలం ఆరెంద గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసు క్రీస్తు జన్మ పవిత్రమైనదని ఆయన పేర్కొన్నారు. అనంతరం మంథని మండలం మల్లారం, శాస్త్రూలపల్లి గ్రామాల్లో క్రిస్మస్ క్యారల్స్ నిర్వహించారు. క్రీస్తు జన్మదినం ప్రాముఖ్యతను గురించి తెలియపరుస్తూ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు దూడ మహేశ్, అజ్మీరా దయారాజ్, మంథని మార్క్, సంఘ పెద్దలు అంకరి కుమార్ ఎంకే జోసఫ్ మంథని ప్రసాద్, అందే రమేష్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments