ఆడబిడ్డ ఇంటి మహాలక్ష్మి.. వారి భవిష్యత్తుకు అండగా ఉంటాను – చిలువేరు సమ్మయ్య గౌడ్.
ఆడబిడ్డలు భారమేమీ కాదు.. భవిష్యత్తుకు బంగారు బాటలు.
గోపా డివిజన్ అధ్యక్షులు సమ్మయ్య గౌడ్.
జనం వాయిస్, కేసముద్రం, జూన్ 05:
ఉప్పరపల్లి గ్రామం నాలుగో వార్డ్ మెంబర్ మంద ప్రవీణ్ & శ్రావణి దంపతులకు మహబూబాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రెండవ కాన్పులో ఆడబిడ్డ జన్మించిన సందర్భంగా ప్రముఖ సామాజిక సేవకుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ ఆసుపత్రికి వెళ్లి తల్లిబిడ్డలను పరామర్శించారు. ఈ సందర్భంగా తల్లి, శిశువు ఆరోగ్య పరిస్థితిని అక్కడి వైద్యులను అడిగి తెలుసుకుని, ఇద్దరూ క్షేమంగా ఉండటంపై ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆడపిల్ల పుట్టడం కుటుంబానికి అదృష్టమని అన్నారు. ఇప్పటికే మంద ప్రవీణ్ దంపతులకు మొదటి కాన్పులో కవల ఆడపిల్లలు, సుభిక్ష, ఆద్య ఉండగా, రెండో సంతానంగా కూడా ఆడబిడ్డ జన్మించడంతో కుటుంబ సభ్యులు కొంత అసంతృప్తికి గురైనట్లు తెలుసుకున్న సమ్మయ్య గౌడ్ వారికి ధైర్యం చెప్పారు. ఆడపిల్లలు భారంగా కాకుండా కుటుంబానికి వరమని, నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తూ కుటుంబాలకు, సమాజానికి గర్వకారణంగా నిలుస్తున్నారని వివరించారు. “ఆడబిడ్డ అంటే మహాలక్ష్మి స్వరూపం. ఆడపిల్లలు ఉన్న ఇల్లు ఆనందాలతో, ప్రేమతో నిండి ఉంటుంది. భవిష్యత్తులో మీ పిల్లల చదువు, అభివృద్ధి కోసం అవసరమైతే నేను కూడా అండగా ఉంటాను. వారి విద్యా బాధ్యతను సైతం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను” అని సమ్మయ్య గౌడ్ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. పరామర్శలో భాగంగా తల్లికి, కుటుంబ సభ్యులకు పండ్లు అందజేసారు, సమ్మయ్య గౌడ్ చూపిన ఆప్యాయత, ప్రోత్సాహం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడపిల్లలను ప్రోత్సహించడం, వారికి నాణ్యమైన విద్య అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆడబిడ్డలను గౌరవించే సమాజమే అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, MRPS నాయకులు,అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments