మద్యం నిషేధిస్తామన్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి బిగ్ షాక్.
జనం వాయిస్ దినపత్రిక:
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గంలో వైన్‌షాపులు సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకే తెరవాలని, పర్మిట్ రూమ్లు వద్దని, ఊరికి బయట మాత్రమే షాపులు ఏర్పాటు చేయాలని, క్రమంగా మద్యం నిషేధిస్తామని రాజగోపాల్ నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. దీంతో టెండర్లు వేయడానికి వ్యాపారులు వెనుకడుగేస్తూ మంత్రి జూపల్లికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రమంతా ఒకే రూల్ ఉంటుందని, వ్యక్తిగతంగా మార్పులు చేయరాదని మంత్రి వ్యాఖ్యానించారు. రాజగోపాల్ నిర్ణయాలపై కాంగ్రెస్ అధిష్ఠానానికి నివేదిక వెళ్లినట్లు సమాచారం.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments