రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య.
జనం వాయిస్, హైదరాబాద్, జూలై 03:
కుంట్లూర్ ప్రాంతంలో నివాసం ఉండే రవికుమార్, శిరీష దంపతులు శుక్రవారం నాడు ఘట్కేసర్ పరిధిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు దంపతులు వరంగల్ ప్రాంతానికి చెందిన వారని, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments