EPAPER
Tuesday, November 17, 2026
- Advertisment -spot_img

లంచం కేసులో పట్టుబడిన టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు.

📰 Generate e-Paper Clip

లంచం కేసులో పట్టుబడిన టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు.

  • రూ.75 వేల లంచం కేసులో గతంలో అరెస్ట్.
  • ఆదాయానికి మించిన ఆస్తులపై తాజాగా తనిఖీలు.

జనం వాయిస్, హైదరాబాద్, నవంబర్ 16:

మొయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణి నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన అధికారులు, అత్తాపూర్‌లోని ఆమె నివాసంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.కాగా, గత సెప్టెంబర్ 30న గుండు వాణి లంచం డిమాండ్ చేసిన కేసులో ఏసీబీకి చిక్కారు. అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.75 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆమె తరఫున లంచం తీసుకుంటుండగా మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యలమోని సుదర్శన్‌ను అధికారులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వాణి, సుదర్శన్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే తాజాగా వాణి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. తనిఖీలు కొనసాగుతున్నాయి.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!