EPAPER
Saturday, November 14, 2026
- Advertisment -spot_img

ఎమ్మెల్యేను విమర్శించే అర్హత అంబటి నరేష్‌కు లేదు!కార్పొరేటర్ నెలకంటి రాము.

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యేను విమర్శించే అర్హత అంబటి నరేష్‌కు లేదు! కార్పొరేటర్ నెలకంటి రాము.

  • కార్మికుల సొమ్ముతోనే అక్రమాలకు పాల్పడ్డాడు.
  • రూ.35 లక్షలు తీసుకున్నట్లు మా వద్ద ఆధారాలున్నాయి.
  • బహిరంగ చర్చకు సిద్ధమా?.
  • ఆర్‌ఎఫ్‌సీఎల్ అలైడ్ యూనియన్ అధ్యక్షుడు, కార్పొరేటర్ నెలకంటి రాము సవాల్.

జనం వాయిస్, గోదావరిఖని, నవంబర్ 14:

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌పై విమర్శలు చేసే స్థాయి, అర్హత అంబటి నరేష్‌కు లేదని ఆర్‌ఎఫ్‌సీఎల్ అలైడ్ యూనియన్ అధ్యక్షుడు, కార్పొరేటర్ నెలకంటి రాము తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం గోదావరిఖనిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన అంబటి నరేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల కష్టాన్ని తన స్వార్థానికి ఉపయోగించుకున్న వ్యక్తి.. కార్మికుల పక్షాన నిలబడుతున్న ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. కార్మికుల జీతాలకు సంబంధించిన సొమ్మును తన వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయించుకొని కార్మికులను మోసం చేశాడని, కాంట్రాక్టర్ నుంచి ప్రతి నెలా వేతనాలు తన ఖాతాలో వేయించుకున్నాడని నెలకంటి రాము ఆధారాలతో సూచించారు. కార్మికుల సమస్యలు, వారి వేతనాల కోసం నిరంతరం పోరాడుతున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌పై నిందలు వేయడం తగదన్నారు. సబ్ కాంట్రాక్టర్ ఇప్పిస్తానని చెప్పి రూ.35 లక్షలు తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. బూడిద లారీలను అడ్డుకొని డబ్బులు డిమాండ్ చేశాడని, అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఎమ్మెల్యేపై విమర్శలకు దిగుతున్నాడని ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కార్మికుల పేరును అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి!

అంబటి నరేష్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని నెలకంటి రాము సవాల్ విసిరారు. తన వద్ద ఉన్న ఆధారాలతో అంబటి నరేష్ అక్రమాలను బహిర్గతం చేస్తానని హెచ్చరించారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసే ముందు తన వ్యవహారాలపై సమాధానం చెప్పాలని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కార్మికుల ప్రయోజనాల పేరుతో వ్యక్తిగత లబ్ధి పొందే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో యూనియన్ నాయకులు వడ్లకొండ మహేందర్, కుమార్, వేణు, జగన్, రాంకీ తదితరులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!