డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలి
జనం వాయిస్, మంథని:
డ్రగ్స్, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కాకతీయ పాఠశాల ప్రిన్సిపాల్ ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మంథని పట్టణం కాకతీయ హై స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు కో కరీకులర్ యాక్టివిటీలో భాగంగా డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలికి ముఖ్యఅతిథిగా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సాగర్ పాల్గొని ప్రసంగించారు. డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని ఆయన తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ… యువత మత్తు పదార్థాల జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రవి, కిరణ్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, పావని, స్రవంతి, పోలీస్ ఉన్నత అధికారులు, కాకతీయ పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments