భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం.
జనం వాయిస్ దినపత్రిక:
ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తులు కిక్కిరిపోయారు. మరోవైపు కార్తీక మాసం కావడంతో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. శనివారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి కేవలం 3 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex)లోని 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శుక్రవారం స్వామి వారిని 82,010 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments