EPAPER
Friday, April 3, 2026
Google search engine

మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు.

📰 Generate e-Paper Clip

మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు.

జనం వాయిస్ దినపత్రిక, తెలంగాణ:

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ అధికారులు భారీ హెచ్చరిక జారీ చేశారు. మొంథా తుఫానుతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయుగుండం తీరం దాటితే తెలంగాణలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇవాళ్టీ(మంగళవారం) నుంచి 29, 30తేదీలలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పటికే.. పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి.దక్షిణ, మధ్య తెలంగాణ మ్యాప్‌లో ముఖ్యంగా ఎరుపు రంగులో మార్క్ చేయబడిన జిల్లాల్లో చాలా భారీ వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల 90-150 మి.మీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు.నీలం రంగులో మార్క్ చేయబడిన జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయన్నారు. కొన్ని చోట్ల 40-70 మి.మీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.కాగా, హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, కాలనీలు జలమయం అయ్యాయి. అలాగే.. ఇవాళ(మంగళవారం) కూడా.. నగరంలోని పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షాలు కురుస్తాయన్నారు. సాయంత్రం తరువాత వర్షాలు తగ్గే అవకాశం ఉన్నట్లు చెప్పారు. వర్షాల నేపథ్యంలో.. అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే.. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు..

ఏపీలో మొంథా తుఫాన్.. అసలు ‘మొంథా’ అంటే అర్థం ఏంటి?

ఏపీలో మొంథా తుఫాన్.. అసలు ‘మొంథా’ అంటే అర్థం ఏంటి?
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రాన్ని మొంథా తుఫాన్ ముంచెత్తింది. “ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ఇళ్ల నుంచి అత్యవసరమైతే తప్పా బయటకు రాకండి” అని అధికారులు తెగ చెప్తున్నారు. రాష్ట్రంలో కూడా తుఫాన్‌ కారణంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అసలు ఈ తుఫాన్‌కు ఆ పేరు ఎవరు పెట్టారు..? మొంథా అంటే అర్థం ఏంటని చాలా మందికి డౌట్. ‘మొంథా’ అనే పేరును థాయ్‌లాండ్‌ సూచించింది. థాయ్‌ భాషలో ‘మొంథా’ అంటే “సువాసన కలిగిన పుష్పం” అని అర్థం.

54 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

మొంథా తుపాను.. 54 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
మొంథా తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో, దక్షిణ మధ్య రైల్వే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. విజయవాడ డివిజన్ మీదుగా వెళ్ళే 54 రైళ్లను రద్దు చేశారు. మంగళవారం, బుధవారం విజయవాడ, గుంటూరు, నర్సాపురం, కాకినాడ, విశాఖ, ఒంగోలు నుండి బయలుదేరాల్సిన ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసింది. కాగా ఇప్పటికే 43 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది.

అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటు, మంత్రులు ఉత్తమ్్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!