EPAPER
Monday, February 16, 2026
Google search engine

ప్రకృతి వైపరీత్యాలతో రాజకీయం తగదు..

📰 Generate e-Paper Clip

ప్రకృతి వైపరీత్యాలతో రాజకీయం తగదు..
-రైతులకు న్యాయం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం.
-ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డదే రైతుల కోసం.

జనం వాయిస్, మంథని:

మంథని: ప్రకృతి వైపరీత్యాలతో రాజకీయం తగదని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ లు మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పైన తీవ్రంగా మండిపడ్డారు. శనివారం మంథని పట్టణం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవలే వ్యవసాయ మార్కెట్ లో పుట్ట మధు చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఆపడం ఎవరి తరం కాదు ముందస్తు చర్యలలో భాగంగా మార్కెట్ లో రైతులకు కావలసినటువంటి ధాన్యం తడవకుండా కవర్లు అందుబాటులో సిద్ధం చేశామని వారు గుర్తు చేశారు.గత ప్రభుత్వం రైతులు వరి వేస్తే ఉరి అని మీ అధినేత కేసిఆర్ బహిరంగంగానే తెలిపారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్  ప్రభుత్వం వచ్చినప్పటినుండి ఒక గింజ కోత లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు త్వరితగతిన డబ్బులను వారి అకౌంట్లో జమ చేయడం ద్వారా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు వారు తెలిపారు.ప్రతి విషయంలోనూ మంత్రి శ్రీధర్ బాబును ముందు పెట్టి మాట్లాడడం తగదని వారు హెచ్చరించారు. మంత్రి శ్రీధర్ బాబు నియోజక వర్గానికి, రాష్ట్రానికి అభివృద్ధిలో ముందు ఉంచాలని కష్టపడుతున్నట్లు వారు గుర్తు చేశారు.  అన్ని కులాలకు సంఘ భవనాలు, గాని కమ్యూనిటీ హాల్లో గాని కోట్ల రూపాయలు సాంక్షన్ చేయించడం జరిగిందని అన్నారు.రైతులకు అకాల వర్షాల దృష్ట్యా రెండు కొత్త బాయిలర్లను తీసుకోవడం జరిగింది వాటిని త్వరలోనే ట్రాన్స్ఫారం ఫీడ్ చేసి వాటిని వాడుకలోకి చేసుకుంటామని వారు తెలిపారు. వాటి ద్వారా రైతులు త్వరితగతన వడ్లను ఆరబెట్టుకొని ధాన్యాన్ని మార్కెట్ కొనుగోలు చేస్తుందని తెలిపారు.గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో క్వింటాకు రెండు నుండి ఐదు కిలోల కోత విధించడం జరిగిందని,అదే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పండించిన దానికి బోనస్ లు అందజేస్తున్నామని వారు పేర్కొన్నారు.గత ప్రభుత్వంలో మిల్లర్లు దళారులు కుమ్మక్కై రైతులను మోసం చేశారని తద్వారా రైతు చాలా నష్టపోవడం జరిగిందని, ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబుపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!