అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి
జనం వాయిస్,మంథని,నవంబర్ 2:
తమకు సంబంధించిన సొంత భూమిలో రాకేష్ అను వ్యక్తి అక్రమ నిర్మాణం చేపడుతున్నాడని,రాకేష్ పైన అతనికి సహకరిస్తున్న అధికారులపైన చర్యలు తీసుకోవాలని ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన తీర్థాల కోమురెల్లి ఆదివారం తెలంగాణ డిజిపికి లేఖ రాసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.తమ భూమిలో అక్రమ నిర్మాణం చేపట్టకూడదని మంథని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ రాకేష్ అధికారుల సహకారంతో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు.ఆర్థికంగా,మానసికంగా వేధిస్తున్నటువంటి రాకేష్,అతనికి సహకరిస్తున్నటువంటి అధికారుల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments