చేవెళ్ల బస్సు ప్రమాదంపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్.
జనం వాయిస్,హైదరాబాద్,నవంబర్04
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద జరిగిన భయానక బస్సు ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు ప్రారంభించింది.ఈ ఘటనలో 19 మంది దుర్మరణం చెందగా, పలువురికి తీవ్ర గాయాలు అయిన విషయం తెలిసిందే.కమిషన్ డిసెంబర్ 15వ తేదీలోపు సమగ్ర నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రవాణా శాఖ, హోంశాఖ, భూగర్భ గనుల శాఖ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. అలాగే జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీలకు కూడా నివేదికను పంపాలని కమిషన్ ఆదేశించింది. ప్రమాద సమయంలో టిప్పర్లో ఉండిన కంకర బస్సుపై పడటమే అధిక ప్రాణనష్టం కు కారణమైందని ప్రాథమిక సమాచారం. ఈ ఘటన మళ్లీ రోడ్డు భద్రత, రవాణా తనిఖీల వ్యవస్థ, హెవీ వాహనాల నియంత్రణపై కీలక ప్రశ్నలు లేవనెత్తింది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments