గోదావరిఖని లో ఘోరమైన సంఘటన.-దారి మైసమ్మలను కూల్చేసిన దుండగులు.
జనం వాయిస్, గోదావరిఖని:
గోదావరిఖని పట్టణంలో హిందువులను కించపర్చే విధంగా అవమానవియమైన సంఘటన జరిగింది.గోదావరిఖని 5 ఇంక్లైన్ నుండి చౌరస్తా ప్రధాన రోడ్లపై మరియు రోడ్డు డివైడర్ల మధ్యలో ఉన్న దారి మైసమ్మల కూల్చివేతలు స్థానికుల ఆగ్రహానికి కారణం అవుతున్నాయి.ఏకంగా పాత కాలం నాటి భక్తి స్థలాలుగా భావించే దారి మైసమ్మ విగ్రహాలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేయడం స్థానికులను కలచివేసింది.

తెలంగాణలో ప్రతి చెట్టుకు పుట్టకు ఒక ప్రత్యేకత ఉంది. రాయినీ దేవుడిగా భావించే ఆచారం వేల ఏళ్లుగా కొనసాగుతోంది.రహదారి పక్కన ఎక్కడైనా ప్రమాదాలు జరగకుండా కాపాడాలని నమ్మి ప్రజలు దారి మైసమ్మలను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తూ వస్తుంటారు.ఇదిలా ఉంటే గోదావరిఖని పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఉన్న ఈ మైసమ్మ విగ్రహాలను కూల్చివేశారు.స్థానికంగా ఉండే కొంతమంది ప్రజలు వ్యాపారస్తులు వారి దుకాణాల సముదాయాల ముందు ఉదయం లేచి చూసేసరికి మైసమ్మ విగ్రహం లేక పోవడంతో షాక్‌కు గురయ్యారు.చుట్టు పక్కల విచారించగా,రాత్రి వేళల్లో ఎవరో వ్యక్తుల విగ్రహాలను కూల్చివేసినట్టు భావిస్తున్నారు.గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని దారి మైసమ్మ విగ్రహాలను తీసివేయడం ఇప్పుడూ చర్చ నీయాంశంగా మారింది.ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నారు.మైసమ్మ విగ్రహాలను కూల్చడం పాపం.ఇది ప్రజల నమ్మకాన్ని అవమానపరచడం అంటూ మండిపడుతున్నారు.దారి మైసమ్మ మా ఊరి ఆత్మ..ఆమెను కూల్చేస్తే మన ఊరికి కాపాడే శక్తి తగ్గిపోతుంది” అంటూ పెద్దవారు విచారం వ్యక్తం చేశారు.ఇదే సమయంలో కొంతమంది స్థానికులు ఇది మున్సిపల్ సిబ్బందిచే జరిగిందా,లేక ప్రైవేటు కాంట్రాక్టర్లు రోడ్డు పనుల కోసం కూల్చారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అధికారుల నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.పట్టణంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.ధార్మిక భావాలను దెబ్బతీసే ఈ చర్యపై విభిన్న వర్గాల ప్రజలు ఖండన వ్యక్తం చేస్తున్నారు.“రోడ్డు మీద ఉన్నా,మైసమ్మ అంటే భక్తి, నమ్మకం…దాన్ని కూల్చడం మానవత్వానికి విరుద్ధం” అంటూ స్థానికులు వ్యాఖ్యానించారు.

Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments