EPAPER
Monday, February 16, 2026
Google search engine

పెరుగుతున్న కోతుల బెడద..భయాందోళనలో ప్రజలు.

📰 Generate e-Paper Clip

పెరుగుతున్న కోతుల బెడద..భయాందోళనలో ప్రజలు.

జనం వాయిస్, మంథని:

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.పట్టణంలో ని బస్ స్టాండ్ ఏరియాలో అధిక సంఖ్యలో కోతులు సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురించేస్తున్నాయి.రోడ్డుకు ఇరువైపులా ఉన్న కిరాణా షాపులు బేకరీల్లో చొరబడుతూ వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి.మంథని పురవిధుల్లో సైతం తిరుగుతూ ఇంటి తలుపులు తెరుచుంటే చాలు లోనికి ప్రవేశించి,నిత్యవసర సరుకులు,పప్పులు, కూరగాయలు, తీసుకు వెళ్లడమే కాకుండా పిల్లలు,వృద్ధులపై దాడులకు పాల్పడుతున్నాయి.కోతుల సంఖ్య పెరగడంతో పట్టణంలో ప్రజలు ఇంటి తలుపులు మూసుకోని ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ విషయమై మున్సిపల్ అధికారులకు సమాచారం అందించి,వినతి పత్రాలు అందించిన స్పందించడం లేదంటు పలువురు కాలనీవాసులు,ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజలు నివాసం ఉంటున్న ఇండ్ల మధ్య ఇంటి పైన గుంపులు గుంపులుగా కోతులు సంచరిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నాయి.మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి కోతుల బెడద లేకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.చుట్టూ ప్రక్కల గ్రామాల్లో కూడ ఇదే పరిస్థితి నెలకోంది.

మంథని కిరాణం షాపు ముందు కోతులు..

Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!