నవంబర్ 8న మిషన్ భగీరథ త్రాగు నీటి సరఫరా నిలిపివేత.
-ఈఈ మిషన్ భగీరథ గ్రిడ్ కే.పూర్ణ చందర్.
జనం వాయిస్, రామగుండం:
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్,అంతర్గాం మండలంలోని 4 ఆవాసాలలో త్రాగునీటి సరఫరా నవంబర్ 8న నిలిపివేయడం జరుగుతుందని ఈఈ మిషన్ భగీరథ గ్రిడ్ కే.పూర్ణ చందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.అంతర్గంలోని ముర్మురు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద సంపు పైప్ లైన్ నిర్వహణ పనులు నిమిత్తం నవంబర్ 8న త్రాగునీటి సరఫరా నిలిపి వేస్తున్నామని,దీనివల్ల రామగుండం మున్సిపల్ కార్పొరేషన్,అంతర్గాం మండలంలో కొంత భాగానికి త్రాగునీటి సరఫరా ఆగిపోతుందని,ప్రజలు దీనిని గమనించాలని ఈఈ మిషన్ భగీరథ గ్రిడ్ ఆ ప్రకటనలో తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments