రామగుండం మున్సిపల్ ఆఫీస్ ముందు పారిశుధ్య కార్మికుల ఆందోళన.
జెసిబి అడ్డుకున్న పారిశుద్ధ్య కార్మికులు.
జనం వాయిస్, గోదావరిఖని మే 25:
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులను పట్టించుకోవడంలేదని కార్మికులు ఆందోళనకు దిగారు. ఇటీవల ఓ మహిళ పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తుండగా ఎండ తీవ్రత తట్టుకోలేక విశ్రాంతి తీసుకుందాం అని మహిళ చెట్టు కింద కూర్చొని నిద్రిస్తున్న సమయంలో వడ దెబ్బకి మహిళ కార్మికురాలు మరణించింది. ఈ సందర్భంగా మహిళా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కుటుంబ సభ్యులు మహిళా కోసం గాలిస్తుండగా మహిళా పనిచేస్తున్న సమీపంలో 4 రోజులకు శవం అయి కనిపించింది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లో పనిచేస్తున్న మహిళా మరణించినందుకు పారిశుద్ధ్య కార్మికులను పట్టించుకోవడం లేదని సోమవారం ఉదయం విధులు బహిష్కరించి ధర్నా కి దిగారు. తమ న్యాయం అయిన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వడదెబ్బ బారి నుండి తట్టుకోవడానికి సంబంధిత సౌకర్యాలు కల్పించాలని కోరారు. మృతురాలి కుటుంబానికి తగిన న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments