పంట మార్పిడితోనే అధిక దిగుబడి.
-ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు..
-తక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం.
-పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు.
జనం వాయిస్, పెద్దపల్లి :
72 వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్బంగా ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించడానికి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జిల్లా ఉద్యాన శాఖ మరియు తిరుమల ఆయిల్ కేం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎలిగేడు, ధూళికట్ట గ్రామాల రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు కు ఎలిగేడు సింగిల్ విండో చైర్మన్ గోపు విజయభాస్కర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.ఆయిల్ ఫామ్ సాగు చేయడం ద్వారా 35 సంవత్సరాల పాటు అధిక లాభాలు వస్తాయని తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీలు, డ్రిప్పు పరికరాలు అందించి సాగును ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఒక్కసారి మొక్కలు నాటితే మూడు సంవత్సరాల తర్వాత నిరంతరం 35 సంవత్సరాల పాటు అధిక లాభాలు వస్తాయన్నారు. మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటలు కూడా వేసుకోవచ్చునని పేర్కొన్నారు.పంట మార్పిడి ద్వారా దిగుబడి అధికంగా పెరుగడమే కాకుండా రైతులు కూడా లాభాల బాట పడుతారని అన్నారు.వరి తో పోలిస్తే నాలుగు రేట్లు ఆదాయం ఎక్కువ,ప్రకృతి వైపారీత్యాల వల్ల వానలు, వరదలు వచ్చిన ఆయిల్ ఫామ్ పంటకి ఎలాంటి నష్టం వాటిల్లదని అన్నారు.తదుపరి ఎలిగేడు మండలం లోని పలు గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 33 మంది లబ్ధిదారులకు రూ.33,03,828 /- రూపాయల విలువ గల చెక్కులను పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలో ఎలిగేడు సింగిల్ విండో చైర్మన్ గోపు విజయభాస్కర్ రెడ్డి, దూళికట్ట సింగిల్ విండో చైర్మన్ వేణుగోపాల్ రావు, ఎలిగేడు MRO యాకయ్య, సంఘాల సీఈవోలు, రైతులు,వ్యవసాయ పరిశోధకులు, మాజీ ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments