రూ.500 బోనస్ వచ్చేసింది.
-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.
-కదంబపూర్ లో రైతుల సంబరాలు.
జనం వాయిస్, పెద్దపల్లి, నవంబర్ 22 :
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం మరోసారి శుభవార్తను అందించింది.వానకాలం సీజన్ లో సన్నరకం ధాన్యం సాగు చేసిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు 500 రూపాయల బోనస్ రైతుల అకౌంట్లోకి జమ అవ్వడంతో రైతుల హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబపూర్ గ్రామ రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి పండ్లు పంపిణి చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లను విక్రయించిన ప్రభుత్వం రైతులకు ముందుగా కనీస మద్దతు ధర చెల్లించిన అనంతరం ఈ బోనస్ వారి ఖాతాలో జమ అయింది అని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవడం రైతుల్లో ప్రభుత్వంపై మరింత నమ్మకాన్ని మరింతగా పెంచిందని గ్రామ రైతులు పేర్కొన్నారు.గోస్కుల సదయ్య, కొమురయ్య, ఓదెలు, బీరయ్య,కొమ్ము సాయికృష్ణ, సతీష్, గట్టయ్య, లక్ష్మి, ఆరెపల్లి తిరుపతి, శంకర్, తిరుపతి, రమేష్, రవి,మల్లయ్య, కొమురయ్య, శ్రీనివాస్, తొంటి కొమురయ్య, సమ్మయ్య, ఓదెమ్మ, రాజేశ్వరి, రేనా, భాగ్యమ్మ, కూరమ్మ,తదితర రైతులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments