మహిళా శక్తీకరణకు బెల్లంపల్లిలో పెద్ద ఎత్తున ప్రోత్సాహం.
–కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యం
–2 కోట్ల 31 లక్షలు 12 వేల రూపాయల వడ్డీరహిత రుణాల చెక్కుల పంపిణీ చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి.
జనం వాయిస్, బెల్లంపల్లి, నవంబర్ 25:
బెల్లంపల్లి మండలంలోని కన్నల రైతు వేదికలో, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళ ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను రూ. 2 కోట్ల 31 లక్షలు 12 వేల విలువతో పంపిణీ చేసినట్లు బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి తెలిపారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మనోజ్, DRDA అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మహిళలు బలపడితే కుటుంబం బలపడుతుంది,కుటుంబం బలపడితే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు.అందుకే మా తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి సమగ్ర ప్రోత్సాహక కార్యక్రమాలను తీసుకొస్తోందని,వడ్డీరహిత రుణాలే కాకుండా,
మహిళలకు పెట్రోల్ బంకుల కేటాయింపు మహిళా గ్రూపులకు బస్సుల కేటాయింపు చిన్న వ్యాపారాలు, సేవా కేంద్రాలు, స్టార్టప్‌లకు ప్రత్యేక సబ్సిడీలు ఇవన్నీ మహిళలు ఆర్థికంగా ముందుకు సాగేందుకు, తమ కుటుంబాలకు ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రభుత్వం చేపడుతుందని అన్నారు.బెల్లంపల్లి నియోజకవర్గంలోని ప్రతి మహిళా సంఘం ఎదగాలి…అభివృద్ధి చెందాలి. అందుకోసం ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం మీ దాకా చేరేలా నేను పని చేస్తానని,మీ అభ్యున్నతి మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని అన్నారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మనోజ్ , DRDA అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments