నిరుద్యోగులకు సువర్ణావకాశం..మంచిర్యాలలో మినీ జాబ్ మేళా.
జనం వాయిస్, మంచిర్యాల, జూన్ 18:
మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జూన్ 20వ తేదీన ఉదయం 10.30 గంటలకు ‘మినీ జాబ్ మేళా’ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక హైటెక్ సిటీ ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్ లోని మోడల్ కెరీర్ సెంటర్ (ఎంసీసీ) లో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ మేళాలో ‘ఐటీఎమ్ స్కిల్స్ అకాడెమీ’ కంపెనీ వారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 100 ‘సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజర్ (ఎస్ఆర్ఎమ్)’ పోస్టుల కోసం ఎంపిక జరుపుతారు. 25 సంవత్సరాల వయస్సు కలిగి, ఏదైనా డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులైన యువతీయువకులు (బీ.టెక్, ఎంబీఏ, మరియు బీ.ఈ చదివిన అభ్యర్థులు అర్హులు కారు) ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి సంవత్సరానికి రూ. 3.2 లక్షల నుండి రూ. 3.8 లక్షల వేతనం లభిస్తుందని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు 8096857078, 9705820030 లేదా 8333059029 నంబర్లను సంప్రదించవచ్చు
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments