EPAPER
Monday, February 16, 2026
Google search engine

ఈతచెట్టు పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు.

📰 Generate e-Paper Clip

ఈతచెట్టు పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు.
-ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు.


జనం వాయిస్,మంథని,డిసెంబర్ 01:


మంథని మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి సంతోష్ గౌడ్ అనే గీతకార్మికుడు ఆదివారం సాయంత్రం ఈత చెట్టు గీస్తుండగా ప్రమాదవశాత్తు నిచ్చెన జారీ క్రింద పడిపోవడంతో చెయ్యి విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాల పాలైన సంతోష్ గౌడ్ ను మంథని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లోని రేని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.ఈత చెట్టు గీస్తు ప్రమాదవశాత్తు క్రిందపడి తీవ్ర గాయాల పాలైన సంతోష్ గౌడ్ ను ప్రభుత్వం  ఆదుకోవాలని మల్లేపల్లి గీత  కార్మిక సంఘం నాయకులు వేడుకుంటున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!